- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala News : రథసప్తమి వేడుకలకు సిద్ధమైన తిరుమల
రథసప్తమి(Ratha Saptami) వేడుకలకు తిరుమల(Tirumala) సిద్ధమైంది.

దిశ, వెబ్ డెస్క్ : రథసప్తమి(Ratha Saptami) వేడుకలకు తిరుమల(Tirumala) సిద్ధమైంది. మంగళవారం రథసప్తమి వేడుకలు బ్రహ్మాండంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ(TTD) అధికారులు పేర్కొన్నారు. రేపు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ సమయం వరకు వేంకటేశ్వరుని దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు పూర్తి చేశామని తెలియజేశారు. గ్యాలరీల్లో తాగునీరు, అన్నప్రసాదం, షెడ్లను ఆలయ అధికారులు నేడు మరోసారి తనిఖీ చేశారు. మలయప్ప స్వామి ఊరేగింపు కోసం తిరుమాడ వీధులను అందంగా అలంకరించామని అన్నారు. ఊరేగింపు సమయంలో మాడ వీధుల్లో మరింతమంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. దాదాపు 3 లక్షల మంది భక్తులు రేపు స్వామి దర్శనానికి రావొచ్చని అంచనా వేస్తున్నారు.
ఎండ తగలకుండా కొత్తగా షెడ్లు, మాడ వీధుల్లో భక్తులకు నిరంతరం అన్న ప్రసాద పంపిణీ చేయనున్నారు అధికారులు. గతంతో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని మరింత భద్రత పెంచారు. అదే విధంగా వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi) టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటTirumala stampede) నేపథ్యంలో ఈ రథసప్తమికి ఎలాంటి ప్రత్యేక టికెట్స్ జారీ చేయలేదు టీటీడీ. భక్తులు అంతా నేరుగా సర్వదర్శనానికి వెళ్ళి తిరుమలేశున్ని దర్శనం చేసుకోవాలని సూచించింది. అలాగే మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు అనుమతించబడవని కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుంది.
అదే విధంగా స్వామి వారికి చేసే నిత్య సేవలైన అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ రథసప్తమి సందర్భంగా రద్దు చేసినట్టు ప్రకటించింది టీటీడీ. ఎన్‌ఆర్‌ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు, ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ఆలయ ఈవో శ్యామలరావు మీడియా ప్రకటన విడుదల చేశారు.






