- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో కొన్నిసార్లు భక్తుల రద్దీ సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(ఆదివారం) శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వారాంతం కావడంతో భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్ లో వేచి ఉన్నారు. నిన్న(శనివారం) శ్రీవారిని 90,011 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,328 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.23 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. గత నెల(జూన్)లో సాధారణం కంటే అధికంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల(జూలై)లో సాధారణ రోజుల్లో సైతం భక్తుల రద్దీ ఉంటోంది.






