- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల సమాచారం : కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
by Ramesh Naini |
స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం లభించడానికి ప్రస్తుతం 18 గంటల సమయం పడుతోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం (ఉచిత దర్శనం) లభించడానికి ప్రస్తుతం 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోవడంతో, క్యూలైన్లు కృష్ణతేజ సర్కిల్ వరకు విస్తరించాయి. భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో టీటీడీ అధికారులు వారికి అవసరమైన తాగునీరు, ఆహార సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.
నిన్నటి గణాంకాలు..
కాగా, నిన్న ఒక్కరోజే మొత్తం 85,132 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.62 కోట్లుగా నమోదైంది. 38,855 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు ఆదివారం టీటీడీ వివరాలు తెలిపింది.
Next Story






