- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా తగ్గిన తిరుమల హుండీ ఆదాయం : టీటీడీ
తిరుమల(Tirumala)లో మొదటి ఆరు నెలల్లో (జనవరి నుండి జూన్ వరకు) శ్రీవేంకటేశ్వర స్వామిని 1.29 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ(TTD) బోర్డ్ పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala)లో మొదటి ఆరు నెలల్లో (జనవరి నుండి జూన్ వరకు) శ్రీవేంకటేశ్వర స్వామిని 1.29 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ(TTD) బోర్డ్ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 3 లక్షల మంది భక్తులు ఎక్కువ దర్శనం చేసుకున్నారని తెలిపింది. అయితే హుండీ ఆదాయం మాత్రం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా తగ్గినట్టు టీటీడీ పేర్కొంది. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో రూ.666.26 కోట్ల హుండీ ఆదాయం రాగా... గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.3 కోట్లు తక్కువ. భక్తుల రద్దీలో పెరుగుదల కనిపించినప్పటికీ, హుండీ కానుకల సగటు సమర్పణలో తగ్గుదల కారణంగా ఆదాయం తగ్గింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివరాల ప్రకారం... గడిచిన ఆరునెలల కాలంలో సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం, ఇతర సేవల ద్వారా భక్తులకు సౌకర్యాలు కల్పించారు.
99 లక్షల మంది తలనీలాలు సమర్పించగా, 6.30 కోట్ల మంది అన్నప్రసాదం స్వీకరించారు. అలాగే 12.14 కోట్ల లడ్డూలు విక్రయించబడ్డాయి. జనవరి 1, 2025న ఒక్క రోజులోనే లక్షకు పైగా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోగా.. ఆ ఒక్కరోజే రూ.3.13 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. భక్తుల సౌకర్యం కోసం టీటీడీ ఆన్‌లైన్ టికెట్స్, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు (రూ.300), గదుల కేటాయింపు వంటి ఏర్పాట్లు చేసింది. అయితే రద్దీ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై కొన్ని పరిమితులు విధించింది.






