Tirumala : తిరుమలలో డ్రెస్ కోడ్ ఉల్లంఘన వివాదం !

by Y. Venkata Narasimha Reddy |

తిరుమలTirumala లో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న అపచారా(Misdeeds)లు వివాదస్పదమవుతున్నా(Controversial)యి. తిరుమల శ్రీవారి దర్శన ప్రక్రియలో అమలులో ఉన్న డ్రెస్ కోడ్ ఉల్లంఘన(Dress Code Violation) ప్రస్తుతం కొత్త వివాదాన్ని రేకెత్తించింది.

Tirumala : తిరుమలలో డ్రెస్ కోడ్ ఉల్లంఘన వివాదం !
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలTirumala లో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న అపచారా(Misdeeds)లు వివాదస్పదమవుతున్నా(Controversial)యి. తిరుమల శ్రీవారి దర్శన ప్రక్రియలో అమలులో ఉన్న డ్రెస్ కోడ్ ఉల్లంఘన(Dress Code Violation) ప్రస్తుతం కొత్త వివాదాన్ని రేకెత్తించింది. డ్రెస్ కోడ్ మేరకు శ్రీవారి దర్శనం సందర్భంగా ధరించాల్సిన సంప్రదాయ దుస్తులు లేకున్నా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి ఓ భక్తురాలి(A Ddevotee)ని అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ బ్రేక్ దర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు సంప్రదాయ దుస్తులతో దర్శనానికి వెళ్లాలి.. పురుషులైతే ధోతీ/కుర్తా పైజమా ధరించాలి. మహిళలు పంజాబీ డ్రెస్, లంగా వోణి, చీరలు ధరించి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఓ మహిళ టీ షర్ట్, నైట్ ప్యాంటు వేసుకుని వీఐపీ బ్రేక్ దర్శనానికి రావడం..అలాగే టీడీడీ సిబ్బంది ఆమెను దర్శనానికి అనుమతించడం పలు విమర్శలకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైకుంఠంలో పనిచేసే టీటీడీ, విజిలెన్స్ అధికారుల తీరు చూస్తుంటే తాము అనుకుంటే ఎలాగైనా దర్శనానికి అనుమతిస్తామన్నట్లుగా ఉందంటూ భక్తులు టీటీడీ సిబ్బంది వైఖరిని తప్పుబడుతున్నారు.

ఇటీవల తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం మొదలుకుని వరుసగా పలు అపచారాలు, వివాదస్పద ఘటనలు చోటుచేసుకున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ తొక్కిసలాటలో ఏకంగా ఆరుగురు భక్తులు చనిపోవడం మరింత వివాదస్పదమైంది. లడ్డూ పోటులో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. తమిళనాడు భక్తులు కోడిగుడ్లు, పలావ్ తో కొండపైకి చేరుకోవడం చెక్ పోస్టుల డొల్ల తనాన్ని చాటింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ప్రధాన ఆలయం ముందు ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధూరి జంట, తదుపరి బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కుటుంబం ఫోటోలు, రీల్స్ ఘటనలు వివాదస్పదమయ్యాయి.

మరోవైపు శ్రీవారి ప్రధానాలయం మీదుగా విమానాలు వెళ్లడం, కొండ ప్రాంతాల్లో డ్రోన్ల చిత్రీకరణలు వంటి ఘటనలు కూడా భక్తుల నుంచి విమర్శలు ఎదుర్కోన్నాయి. ఇటీవల అలిపిరి కొండల్లో ముంతాజ్ హోటల్ కు అనుమతించడం కూడా భక్తుల నుంచి ఆందోళనలు రేగుతున్నాయి. తిరుమలలో అన్యమత ఉద్యోగులు పనిచేయడానికే వీల్లేదంటుంటే అన్యమత హోటల్ కు ఎలా అనుమతించారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలు గౌరవించి తిరుమల ప్రాశస్త్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే ఆ హోటల్ కు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story