శ్రీవారి భక్తుల నగలు చోరీ

by Naga Rani Yarlagadda |

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తుల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్, కూకట్ పల్లిలోని ప్రగతి నగర్ కు చెందిన శ్రీదేవి కుటుంబం శ్రీవారి దర్శనానికి వచ్చారు.

శ్రీవారి భక్తుల నగలు చోరీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తుల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్, కూకట్ పల్లిలోని ప్రగతి నగర్ కు చెందిన శ్రీదేవి కుటుంబం శ్రీవారి దర్శనానికి వచ్చారు. విష్ణు నివాసంలోని రూమ్ నెంబర్ 613 లో వారు వసతి పొందారు. రూమ్ లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు నగలు కాజేసినట్లు సమాచారం. 16 గ్రాముల బంగారు నగలు అపహరణ గురయ్యాయని వారు ఆలస్యంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story