తిరుమ‌లలో భ‌క్తుల ఆందోళ‌న‌..షాకింగ్ వీడియో వైర‌ల్ !

by velandi.Saikiran |

తిరుమ‌ల క్యూ లైన్ లో ఫ్యాన్లు న‌డ‌క‌పోవ‌డంతో భ‌క్తులు ఆందోళ‌న‌కు దిగారు.

తిరుమ‌లలో భ‌క్తుల ఆందోళ‌న‌..షాకింగ్ వీడియో వైర‌ల్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రతి రోజు 50 వేల నుంచి లక్ష మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయినప్పటికీ చిన్న లోపాల వ‌ల్ల‌ చాలా సార్లు తిరుమల కొండపై భక్తులు ఇబ్బందులు పడ్డ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కింది స్థాయి అధికారుల తప్పిదాల వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయి. అయితే లేటెస్ట్ గా తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో సంఘటన తెరపైకి వచ్చింది.

క్యూ లైన్ లో ఫ్యాన్లు ఆఫ్ చేసి ఉన్న నేపథ్యంలో ఉక్కపోతతో భక్తులు అష్ట కష్టాలు పడ్డారు. మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రత విపరీతంగా ఉన్న‌ప్ప‌టికీ ఫ్యాన్లు వేయ‌కుండా అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని తెలుస్తోంది. కరెంటు ఉన్నప్పటికీ, సిబ్బంది మాత్రం ఫ్యాన్లను పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో క్యూ లైన్ లో ఉన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలక మండలి పై సీరియస్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనిపై వైసీపీ పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నాడని నిలదీస్తున్నారు. ఎండా కాలంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story