- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్.. ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు
తిరుమల (Tirumala) కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో తదుపరి దర్యాప్తును సీబీఐ (CBI) డైరెక్టర్ ఏఎస్పీ (ASP) వెంకట్రావుకు అప్పగిస్తూ గతేడాది 28న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, కేసులో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్‌లోని సభ్యుడు కాని ఏఎస్పీకి తమను విచారణకు పిలవడాన్ని సవాలు చేస్తూ.. వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారావు (YV Subba Reddy) పీఏ అప్పన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్ హరినాథ్ (Justice Harinath) సంచలన వ్యాఖ్యలు చేస్తూ కీలక తీర్పులు వెలువరించారు.
సుప్రీం కోర్టు ఆదేశానుసారదంగా ఐపీఎస్ అధికారులు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపినాథ్ జెట్టిలను సిట్‌లో సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసిందని, ఆ టీమ్‌లో అడిషనల్ ఎస్పీ వెంకట్రావును దర్యాప్తు అధికారిగా చేర్చడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందని న్యాయమూర్తి కామెంట్ చేశారు. సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ మాత్రమే పర్యవేక్షించాలని న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. అదేవిధంగా కేసులో దర్యాప్తును ఏఎస్పీ వెంకట్రావు (ASP Venkat Rao)కు అప్పగిస్తూ సీబీఐ డైరెక్టర్ ఇచ్చిన ఆర్డర్ సుప్రీం ధర్మాసనం ఆదేశాలను బేఖాతరు చేసినట్లేనని జస్టిస్ హరినాథ్ అన్నారు. అదేవిధంగా కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగియగా.. కోర్టును తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా వెల్లడించింది.






