తిరుమల కల్తీ నెయ్యి కేసు.. TTD మాజీ చైర్మన్ YV సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు

by Kema Shiva Kumar |

శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసిన సిట్ (SIT) దర్యాప్తును ముమ్మరం చేసింది.

తిరుమల కల్తీ నెయ్యి కేసు.. TTD మాజీ చైర్మన్ YV సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసిన సిట్ (SIT) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు ఇవాళ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈనెల 13న తిరుమలలోని సిట్ కార్యాయానికి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, A16గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్‌ను‌ సిట్ అరెస్ట్ చేసింది. గతంలో టీటీడీ ఈవోగా పని చేసిన ధర్మారెడ్డి ఇవాళ సిట్ కార్యాలయాలనికి విచారణకు రావడం ఆసక్తికరంగా మారింది

Next Story