రైతులకు BIG అలర్ట్.. నల్లమల ఫారెస్ట్‌లో 80 పెద్దపులులు

by Gantepaka Srikanth |

నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పల్నాడు జిల్లాలోని పలు గ్రామాలు, తండాలకు సమీపంలో అవి సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

రైతులకు BIG అలర్ట్.. నల్లమల ఫారెస్ట్‌లో 80 పెద్దపులులు
X

దిశ, ప్రతినిధి నరసరావుపేట: నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పల్నాడు జిల్లాలోని పలు గ్రామాలు, తండాలకు సమీపంలో అవి సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 1983లో రాజీవ్ గాంధీ టైగర్ ప్రాజెక్ట్ ను నల్లమల కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి శ్రీశైలం, నంద్యాల అటు తెలంగాణ హద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టులో చేర్చారు. ఆనాడు వదిలిన కొన్ని పులుల సంతతి పెరిగిపోయింది. ప్రస్తుతం 80కి పైగానే ఉన్నట్టు అటవి శాఖా అధికారులు అంచనా వేస్తున్నారు. పులుల రక్షణ కోసం ఈ అభయారణ్యంలో అనేక చర్యలు చేపట్టడంతో వాటి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద పులులను గుర్తించేందుకు అటవి ప్రాంతంలోని నీటికుంట వద్ద, పలు ప్రాంతాల్లో ట్రాప్ కెమేరాలను అమర్చారు. దీని ఆధారంగా ఇప్పటికే లెక్కలు తీసినట్లు తెలిసింది. త్వరలోనే పూర్తి స్థాయి డేటాను అధికారులు విడుదల చేయనున్నారు.

జనావాసాల్లోకి...

రాష్ట్రంలోనే అతి పెద్ద పులుల అభయారణ్యంగా శ్రీశైలం సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పేరు గాంచింది. పల్నాడు జిల్లాలో వ్యాపించి ఉన్న నలమల ఫారెస్ట్ పరిధిలో ఉన్న అభయారణ్యంలో కూడా గతంలో కంటే పులల సంఖ్య పెరిగటం వల్ల అవి నీటి కోసం అడవి అంతా తిరుగుతాయి. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి, రెంటచింతల, మాచర్ల మండలాల్లో నల్లమల హద్దుల్లో ఉన్న తండాలు, గ్రామాల సరిహద్దుల్లో సంచరిస్తున్నట్టు సమాచారం. తీవ్ర నీటి ఎద్దడి కారణంగా రక్షణ ప్రాంతం దాటి గ్రామాలవైపు వస్టున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత వెల్ధుర్ధి మండల పరిధిలోని నలమల ఫారెస్ట్‌లో మొత్తం 5 వరకూ పులులు, పిల్లలు ఉన్నట్లు లెక్కకట్టారు.

రైతులు జాగ్రత్తగా ఉండాలి..

ఈ క్రమంలోనే అటవీ సమీప ప్రాంతాల్లో వ్యవసాయ భూములున్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖా అధికారులు కోరుతున్నారు. అదే విధంగా అడవిలోకి వెళ్లే సమయంలో పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తండాలు, గ్రామాల సమీపంలోకి వస్తున్నాయన్న వార్తలతో ప్రజలు భయ పడుతున్నారు. రెండేళ్ల క్రితం పల్నాడు జిల్లా దుర్గి మండలం గజాపురం వద్ద వేసవిలో పులులు కనిపించాయి. రెండు పులులు కనిపించడమే కాకుండా ఆవుపై దాడి చేసి చంపేశాయి. ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో నల్లమల అటవీ ప్రాంతం మొత్తంలో ఎన్ని పులులున్నాయో వాటి వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story