తల్లికి దూరం.. జూలో అనారోగ్యంతో పులిపిల్ల మృతి

by Sathputhe Rajesh |   (  Updated:2023-05-31 02:45:36  IST  )

తిరుపతి ఎస్వీ జూలో పులిపిల్ల మృతి చెందింది.

తల్లికి దూరం.. జూలో అనారోగ్యంతో పులిపిల్ల మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి ఎస్వీ జూలో పులిపిల్ల మృతి చెందింది. 2 నెలల క్రితం నల్లమలలో తల్లికి దూరం కావడంతో పులిపిల్లలను జూకు తరలించారు. 4 పులి పిల్లల్లో ఒకటి అనారోగ్యంతో మృతి చెందింది. కిడ్నీ, లివర్ సమస్యతో పులిపిల్ల చనిపోయిందని అధికారులు తెలిపారు. మిగిలిన మూడు పులిపిల్లల బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. పులిపిల్లల ఆరోగ్యాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని పెద్దగుమ్మడాపురం వద్ద నాలుగు పులి కూనలు దొరికిన విషయం తెలిసిందే.

Next Story