- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయనగరం జిల్లాలో చిరుత సంచారం..భయాందోళనలో ప్రజలు
by Vemula.Srinu Prasad |
విజయనగరం జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేగింది...

X
దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేగింది. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రాంతం దిబ్బలపాలెంలో చిరుత పులి తిరిగింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి ప్రదేశాన్ని పరిశీలించారు. పులి పాదముద్రలు గుర్తించారు. ఆ ప్రాంతంలో పులి సంచరించినట్లు గుర్తించారు. పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చిరుతను బంధించే వరకూ స్థానిక ప్రజల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రాంతం వైపు ఒంటరిగా రావొద్దని సూచించారు. అలాగే అటు వైపు పశువులను పంపొద్దని సూచించారు. పులిని బంధించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
Next Story






