బస్సులో ఊపిరాడక ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-22 16:47:28  IST  )

క‌ర్నూలు జిల్లా దేవ‌న‌కొండ‌లో ఆర్టీసీ సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగా బ‌స్సులో ఉన్న ముగ్గురు విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. బ‌స్సులో సిబ్బంది ప‌రిమితికి మించి జ‌నాల‌ను ఎక్కించారు.

బస్సులో ఊపిరాడక ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత
X

దిశ‌, వెబ్ డెస్క్: క‌ర్నూలు జిల్లా దేవ‌న‌కొండ‌లో ఆర్టీసీ సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగా బ‌స్సులో ఉన్న ముగ్గురు విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. బ‌స్సులో సిబ్బంది ప‌రిమితికి మించి జ‌నాల‌ను ఎక్కించారు. దీంతో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు అస్వ‌స్థ‌కు గుర‌వ్వ‌డంతో వెంట‌నే బ‌స్సును మార్గమ‌ధ్య‌లో నిలిపివేశారు. డ్రైవ‌ర్ వెంట‌నే ఆ విద్యార్థుల‌కు ప్ర‌థ‌మ చికిత్స అంద‌జేశారు. దీంతో విద్యార్థులు కోలుకున్నారు. బ‌స్సులో ప‌రిమితికి మించి ప్రయాణికుల‌ను ఎక్కించ‌డం వ‌ల్లే ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చింద‌ని విద్యార్థుల త‌ల్లి దండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే మ‌రో బ‌స్సును ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు.

Next Story