- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు.. ఫైబర్నెట్ చైర్మన్ సంచలన ప్రకటన
ఏపీ ఫైబర్ నెట్ లో ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు పడింది.

దిశ డైనమిక్ బ్యూరో : ఏపీ ఫైబర్ నెట్ లో ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు తొలగిస్తున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఫైబర్ నెట్ బిజినెస్ హెడ్ గంధంచెట్టు సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భరద్వాజను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సంస్థలో 400 మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఉద్యోగుల తొలగింపు ఆదేశాలపై ఫైబర్నెట్ ఎండీ, ఈడీ సంతకాలు చేయలేదన్నారు. ఉద్యోగులకు జీతాల రూపంలో సంస్థ సొమ్ము చెల్లించారని పేర్కొన్నారు. ఫైబర్ నెట్ ఉన్నతాధికారులు గత ప్రభుత్వంతో చేతులు కలిపారని ఆరోపించారు.
ఫైబర్ నెట్ కు జీఎస్టీ అధికారులు రూ.377 కోట్లు జరిమానా విధించారని తెలిపారు. గత నెలలో జరిమానా విధించినా అధికారులు తనకు తెలియజేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలైనా ఫైబర్ నెట్ లో పురోగతి లేదన్నారు. సంస్కరణను చేపడుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. ఇంటర్నెట్ వ్యవస్థలో నిత్యం సమస్యలు వస్తున్నాయి అన్నారు. ఫైబర్ నెట్ అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనేదానిపై ఇవన్నీ నిదర్శనం అన్నారు. ఫైబర్ నెట్ ఎండీ దినేష్‌కుమార్ ఒక్క ఆపరేటర్ను కూడా కలవడం లేదన్నారు. ఇది ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫైబర్ నెట్ ను దినేష్ కుమార్ చంపేయాలని చూస్తున్నారని భావించాలి అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఉన్నట్లే దినేష్ కుమార్ పనిచేస్తున్నారని అన్నారు. కనీసం టార్గెట్లు పెట్టడం లేదని తెలిపారు. తాము తొలగించిన సిబ్బందికి మూడు నెలలు జీతాలు చెల్లించారని, ఆ మొత్తాన్ని దినేష్ కుమార్ ఉన్నతాధికారుల నుంచి వసూలు చేయాలన్నారు.






