- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు నెలల్లో... మూడు పథకాలు..
వచ్చే మూడు నెలల పాటు మూడు ముఖ్యమైన పథకాలు అమలు చేస్తామని, ఆ విషయాన్ని మంత్రులు ప్రజల్లోకి వెళ్లి, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

దిశ. డైనమిక్బ్యూరో : వచ్చే మూడు నెలల పాటు మూడు ముఖ్యమైన పథకాలు అమలు చేస్తామని, ఆ విషయాన్ని మంత్రులు ప్రజల్లోకి వెళ్లి, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సీఎం అధ్యక్షతన సచివాలయంలో ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలని, ప్రజల్లోకి వెళ్లి పథకాల అమలును సమీక్షించాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయానికి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో 'తల్లికి వందనం' కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, ఆ మేరకు ప్రజల్లోకి దీనిని తీసుకు వెళ్లాలన్నారు. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా అమలు చేస్తామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధివిధానాలపై మంత్రులతో చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తాము కట్టబడి ఉంటామని సీఎం తెలిపారు. కరెంటు చార్జీలు పెంచబోమని, అవకాశం ఉంటే తగ్గించాలని ఆయన తేల్చి చెప్పారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ వేగంగా అమలయ్యేలా చూడాలన్నారు. బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులను మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. నకిలీ రిజిస్ట్రేషన్లపై పలువురు మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. బోగస్ రిజిస్ట్రేషన్ల కట్టడికి చర్చలు తీసుకోవాలన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణంపైనా చర్చించారు. ఈ సందర్భంగా 21 అంశాలను ఏపీ కేబినెట్ ఆమోదించింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు..50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో చేసిన చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయం చేసింది. గతంలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 77 రద్దు చేయనుంది. అదే విధంగా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు నిర్ణయించింది. వెనుక బడిన మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. విద్యుత్ సహా పలు విభాగాల్లో పారిశ్రామిక వేత్లకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఏపీ నాలెడ్జ్సొసైటీ కెపాసిటీ బిల్డింగ్కు 2025కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.






