Breaking:విజృంభిస్తున్న కరోనా.. రాష్ట్రంలో నలుగురికి పాజిటివ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-31 05:05:31  IST  )

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది

Breaking:విజృంభిస్తున్న కరోనా.. రాష్ట్రంలో నలుగురికి  పాజిటివ్
X

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh)లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం(AP Government) అప్రమత్తమై అన్ని జిల్లా కేంద్రాల్లో కరోనా వార్డులను ఏర్పాటు చేసింది.

ఈ తరుణంలో తాజాగా రాష్ట్రంలో నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఏలూరు కలెక్టరే‌ట్‌లో పనిచేసే నలుగురు సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. వారు కొవిడ్ లక్షణాలతో బాధ పడుతుండటంతో ఏలూరు సర్వజన ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలో వీఆర్‌డీఎల్ ల్యాబ్ లో గురువారం పరీక్షలు చేయించుకున్నారు.

ఈ తరుణంలో నిన్న(శుక్రవారం) రిపోర్టు రాగా నలుగురికి కరోనా పాజిటివ్(Corona positive) నిర్ధారణ అయింది. వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో కలెక్టరేట్‌లోని ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఒకటి, తాడేపల్లి లో ఒక కరోనా కేసు నమోదైంది. చాపకింద నీరులా కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ క్రమంలో ఏ చిన్న లక్షణం కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Next Story