- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
రాజమండ్రి నగరంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో : రాజమండ్రి నగరంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంతో బ్రిడ్జి పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రాథమిక వివరాల మేరకు, సోమవారం సాయంత్రం రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు పల్సర్ బైక్‌లు వేగంగా వస్తూ ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో బ్రిడ్జిపై ట్రాఫిక్ తీవ్రంగా స్థంభించింది.
సమాచారం అందుకున్న వెంటనే రాజమండ్రి టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.






