- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి
కడప జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చింతకొమ్మదిన్నె మండలం పాలెం పల్లి వద్ద అత్యంత వేగంగా వస్తున్న రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కడప జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చింతకొమ్మదిన్నె మండలం పాలెం పల్లి వద్ద అత్యంత వేగంగా వస్తున్న రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు కార్ల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
కొందరి పరిస్థితి విషమం!
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కార్లలో చిక్కుకున్న వారిని బయటకు తీసి 108 వాహనంలో కడప రిమ్స్ (RIMS) ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు తిరుపతి పట్టణం జీవకోనకు చెందిన హర్షవర్ధన్(27) కిషోర్(28) సుధీర్ కుమార్ రెడ్డి(24 )గా పోలీసులు గుర్తించారు.
తిరుపతి నుంచి హైదరాబాదుకు
తిరుపతి నుంచి హైదరాబాదుకు వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, షిఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా ఎర్టిగా కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి అతివేగం కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






