తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. సుప్రీంకోర్టులో చిన్నప్పకు ఎదురుదెబ్బ

by Naga Rani Yarlagadda |

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో చిన్నప్పకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. సుప్రీంకోర్టులో చిన్నప్పకు ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో చిన్నప్పకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అయిన ఆయనకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కల్తీ లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు చెప్పినవారిని కాకుండా మరొకరిని సిట్ లో నియమించారని వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్ప హైకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ చేసిన కోర్టు చిన్నప్పకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. సీబీఐ ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ.. చిన్నప్పకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

Next Story