- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సత్యసాయి జిల్లాలో విషాదం.. నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
శ్రీసత్యసాయి జిల్లా నాగేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారి బాలురు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ముగ్గురు పిల్లలను హర్షిత్ రెడ్డి, ధన్వంత్, సుజిత్ గుర్గించారు. ..

దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా నాగేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారి బాలురు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ముగ్గురు పిల్లలను హర్షిత్ రెడ్డి, ధన్వంత్, సుజిత్ గుర్గించారు. ఆటలాడుకుంటూ వెళ్లి నీటిగుంటలో పడిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
నాగేపల్లిలో తీవ్ర విషాదం
ఈ ముగ్గురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలోనే కాక, మొత్తం నాగేపల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కళ్ల ముందే తిరుగుతూ సందడి చేసిన పిల్లలు ఒక్కసారిగా అనంత లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
మంత్రి సవిత దిగ్భ్రాంతి
ఈ ఘోర ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఇలా అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమని ఆమె విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ, ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సవిత హామీ ఇచ్చారు.






