- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : గోదావరిలో ఈతకు దిగి ముగ్గురు బాలురు గల్లంతు
పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆచంట మండలం అయోధ్యలంక పరిధిలోని రావిలంక వద్ద గోదావరి నది(Godavari River)లో ముగ్గురు బాలురు స్నానానికి దిగి గల్లంతయ్యారు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా పోలీసులు, రెవెన్యూ అధికారుల వివరాల ప్రకారం.. ఈ ఘటన పి.గన్నవరం మండలం నాగులంక గ్రామ శివారులో జరిగింది. ముగ్గురు బాలురు సాయంత్రం గోదావరిలోకి ఈతకు దిగగా.. నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. వీరి బట్టలు, సెల్‌ఫోన్‌లు నది ఒడ్డున కనిపించాయి.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. మునిగిపోయిన బాలురను వెతకడానికి రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. గతంలో కూడా ఈ ప్రదేశంలో ఇలాంటి దుర్ఘటనలు జరిగాయి. ముఖ్యంగా వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రవాహంలో పడి కొట్టుకుపోయినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






