- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఎడ్ ప్రశ్నపత్రం లీక్.. ముగ్గురు అరెస్ట్
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(Acharya Nagarjuna University)లో ఈ నెల 6వ తేదీ నుంచి బీఎడ్ పరీక్షలు(BEd Exams) జరుగుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(Acharya Nagarjuna University)లో ఈ నెల 6వ తేదీ నుంచి బీఎడ్ పరీక్షలు(BEd Exams) జరుగుతున్నాయి. ఈ క్రమంలో మొదటి సెమిస్టర్(First Year Semester) ప్రశ్నపత్రం(Question Paper) అరగంట ముందుగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఛైల్డ్ డెవలప్‌మెంట్ పరీక్ష(Perspectives in Child Development Exam) జరగాల్సి ఉండగా అరగంట ముందుగానే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది.
ఈ నేపథ్యంలో తాజాగా.. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సీటిలో బీఎడ్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో ముగ్గురు నిందితులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లు ఒడిశాకు చెందిన ఏజెంట్లని, ఆ రాష్ట్ర విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తుంటారని తెలిపారు. అలాగే పాస్ చేయించేందుకు క్వశ్చన్ పేపర్లను లీక్ చేస్తుంటారని గుర్తించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటన పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) స్పందిస్తూ.. పేపర్ లీక్ అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని చెప్పారు. వెంటనే విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
Read Also..
Good news: టెన్త్ పరీక్షలు రాస్తున్నారా? అయితే మీకో శుభవార్త






