Good news: టెన్త్ పరీక్షలు రాస్తున్నారా? అయితే మీకో శుభవార్త

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-08 05:15:11  IST  )

ఈ నెల 17 నుంచి పదో తరగతి విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.

Good news: టెన్త్ పరీక్షలు రాస్తున్నారా? అయితే మీకో శుభవార్త
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 17 నుంచి పదో తరగతి విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా APSRTC గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలను అందించనుంది. ఈ మేరకు APSRTC ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 450 పరీక్ష కేంద్రాల్లో 6.49 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డీనరీ బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు. కేవలం హాల్‌ టికెట్‌ ఉంటే చాలని స్పష్టం చేశారు. అంతేకాదు, విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలని RTC యాజమాన్యం అధికారులను ఆదేశించింది.

ఇక టెన్త్ విద్యార్థులు ప్రభుత్వ వాట్సప్‌ సేవ (మన మిత్ర) ద్వారా హాల్‌ టికెట్లను డౌన్​లోడ్ చేసుకోవచ్చు. 9552300009 నెంబర్​కి ఫోన్‌ ద్వారా Hi అని వాట్సప్​లో మెసేజ్ చేస్తే, సేవను ఎంచుకోండి అని ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ చేసి మనకు అవసరమైన విద్య సేవలు సెలక్ట్ చేసుకోవాలి. తరువాత SSC హాల్​ టికెట్​ అనే ఆప్షన్​పై క్లిక్ చేసి, అడిగిన వివరాలు ఎంటర్ చేయాలి. వివరాలు ఎంటర్ చేయగానే కొద్ది నిమిషాల్లోనే హాల్‌టికెట్‌ వాట్సప్​కే వస్తుంది. డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ తీసుకోవాలి.

పరీక్షల షెడ్యూల్:

* మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్

* మార్చి 19న సెకండ్​ లాంగ్వేజ్

* మార్చి 21న ఇంగ్లిష్

* మార్చి 22న ఫస్ట్ లాంగ్వేజ్​ పేపర్-2

* మార్చి 24న మ్యాథమెటిక్స్

* మార్చి 26న ఫిజికల్ సైన్స్

* మార్చి 28న బయోలాజికల్ సైన్స్

* మార్చి 29న OSSC మెయిన్ లాంగ్వేజ్​ పేపర్ 2, ఒకేషన్ కోర్స్ (థియరీ)

* మార్చి 31న సోషల్ స్టడీస్

Next Story