ఏపీలో వేలకొద్దీ క్యాన్సర్ కేసులు

by Muthe.Rajitha |

ఏపీలో వేలకొద్దీ క్యాన్సర్ కేసులు బయటపడటం సంచలనం రేపుతోంది.

ఏపీలో వేలకొద్దీ క్యాన్సర్ కేసులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో వేలకొద్దీ క్యాన్సర్ కేసులు బయటపడటం సంచలనం రేపుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 39 లక్షల స్క్రీనింగ్స్ నిర్వహించగా.. వారిలో దాదాపు 60 వేల మందికి క్యాన్సర్ లక్షణాలు బయట పడ్డాయి. వారిలో అత్యధికంగా 26,639 మందికి నోటి క్యాన్సర్ లక్షణాలు బయట పడగా.. 22,861 మందికి సర్వైకల్ క్యాన్సర్ అని తేలింది.

ఇక మరో 9,963 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించారు. కాగా వీరందికీ బోధనాసుపత్రుల్లో ఆంకాలజీ స్పెషలిస్టులతో పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్దారణ అనంతరం చికిత్స అందిస్తామని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. క్యాన్సర్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని, ఇకపై రాష్ట్రంలో తరచూ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు.

Next Story