‘వైసీపీకి పొత్తు తప్పదా?’.. ఆ ప్రశ్నకు వైఎస్ జగన్ రియాక్షన్ ఇదే!

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-01 11:01:34  IST  )

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌(Former CM YS Jagan) ఇవాళ(మంగళవారం) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు.

‘వైసీపీకి పొత్తు తప్పదా?’.. ఆ ప్రశ్నకు వైఎస్ జగన్ రియాక్షన్ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌(Former CM YS Jagan) ఇవాళ(మంగళవారం) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాలు అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ భేటీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ యువ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్ధేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారికి సమస్య వచ్చినప్పుడు తోడుగా నిలబడాలని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

మొన్నటి వరకు ఒంటరి పోరాటానికి అలవాటు పడిన పార్టీగా వైసీపీ(YSRCP)కి పేరుంది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పొత్తులపై ప్రశ్న ఎదురైంది. వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి(MLC Varudu Kalyani) వచ్చే ఎన్నికల్లో మనం పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ.. ఈ విషయం నాకు వదిలేయండి అన్నారు. ఈ క్రమంలో ఎప్పుడు అయిన పొత్తులు పెట్టుకున్నామా? అని ప్రశ్నించారు. అయితే, వైఎస్ జగన్ ఎప్పుడైనా పొత్తు పెట్టుకున్నామా అంటూనే.. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, అప్పుడు చూద్దామని వ్యాఖ్యానించారు. అలాగే రాబోయే ఎన్నికల ముందు తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.

Next Story