- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Indrakeeladri:మూడు రోజులు దుర్గాగుడి ఘాట్‌రోడ్డు మూసివేత.. కారణమిదే!
విజయవాడలోని ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి ఆలయానికి నిత్యం భారీగా భక్తులు వెళుతుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడలోని ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి ఆలయానికి నిత్యం భారీగా భక్తులు వెళుతుంటారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు(Devotees) తరలి వస్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కీలక సూచనలు చేశారు.
ఇంద్రకీలాద్రి ఆలయం వైపు వెళ్లే ఘాట్ రోడ్డును మూడు రోజులు మూసి వేయనున్నట్లు సమాచారం. ఈ నెల(మే) 6, 7, 8వ తేదీల్లో దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేయనున్నారు. అయితే.. కొండచరియలు పనుల్లో భాగంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో ఆంక్షాలు విధించారు. ఈ నేపథ్యంలో మరమ్మతుల దృష్ట్యా ఘాట్‌రోడ్డు మూసివేయాలని నిర్ణయించారు. ఈ తరుణంలో భక్తులు కనకదుర్గానగర్ మార్గం నుంచి వెళ్లాలని అధికారులు సూచించారు. పున్నమిఘాట్‌లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు.






