Minister Nara Lokesh:రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్.. కారణం ఇదే!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-16 09:55:56  IST  )

ఏపీ(Andhra Pradesh) విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) రేపు(శనివారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

Minister Nara Lokesh:రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్.. కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) రేపు(శనివారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఢిల్లీ(Delhi)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)తో మంత్రి నారా లోకేష్(Nara Lokesh) భేటీ కానున్నారు. గత కొన్ని రోజుల నుంచి మంత్రి లోకేష్ ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో రేపు ఢిల్లీ పర్యటనకు మంత్రి లోకేష్ సిద్ధమయ్యారు. గతంలో ప్రధాని మోడీ విశాఖ, అమరావతిలో పర్యటన సమయంలో లోకేశ్‍ను తనను వచ్చి కలవాల్సిందిగా ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు సమాచారం.

Next Story