- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Chandrababu:యోగాను ఇంతలా ప్రమోట్ చేయడానికి కారణం ఇదే!
విశాఖలో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా నిర్వహించే ‘‘యోగాంధ్ర కార్యక్రమం’’ అత్యంత కీలకమైనదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

దిశ,వెబ్‌డెస్క్: విశాఖలో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా నిర్వహించే ‘‘యోగాంధ్ర కార్యక్రమం’’ అత్యంత కీలకమైనదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆ రోజున సాధించబోయే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ మహానగరం వైపు చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గత నెల(మే) 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎల్లుండి యోగాంద్ర కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల(జూన్) 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు హాస్పిటల్ కి వెళ్తాం.. మందులు వేసుకుంటాం.. అవసరమైతే ఆపరేషన్ చేయించుకుంటాం’’ అని తెలిపారు. కానీ, నిరంతరం యోగా, వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందన్నారు.
ఆరోగ్యానికి ఉత్తమ మార్గం యోగా, వ్యాయామం అని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో యోగ ఒక భాగం కావాలి.. అందుకే యోగ ఇంతలా ప్రమోట్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో యోగా డే గిన్నిస్ బుక్ రికార్డు దిశగా కొంతమంది ట్రైనర్లు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఐదు లక్షల మంది పాల్గొనే విధంగా ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయి. విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 1,30,000 మంది ట్రైనింగ్ పొందిన ట్రైనర్లకు అనుమతిస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.Twitter Link






