- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Deputy CM:‘మీరు నాకు పెద్దన్న’.. సూపర్ స్టార్ వ్యాఖ్యలకు పవర్ స్టార్ రిప్లై ఇదే!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రజినీకాంత్ సినీ కెరీర్ లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన రజినీకాంత్.. ‘‘ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా ప్రియమైన సోదరుడు, రాజకీయ తుఫాన్ పవన్ కళ్యాణ్.. మీ ఆత్మీయ శుభాకాంక్షలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి’’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌ను తలైవా 'పొలిటికల్ తుఫాన్' అని పేర్కొనడం పోస్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ తరుణంలో తనకు కృతజ్ఞతలు చెబుతూ సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన ట్వీట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. ప్రియమైన పెద్దన్న రజినీకాంత్.. పెద్దన్న సమానులైన మీకు నమస్కారాలు. మీ ఆప్యాయతతో కూడిన మాటలకు, ఆశీర్వాదాలకు నేను నిజంగా కృతజ్ఞుడను అని తెలిపారు. మీ కీర్తి పెరగాలి, మరిన్ని విజయాలు సాధించాలని మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.






