- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh:మంత్రి లోకేష్ తిరుపతి పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఏపీ(Andhra Pradesh) విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఇవాళ(బుధవారం) తిరుపతిలో పర్యటించనున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఇవాళ(బుధవారం) తిరుపతిలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం(Gannavaram Airport) నుంచి బయలుదేరి తిరుపతి(Tirupati) వెళ్లారు. తిరుపతిలో మంత్రి నారా లోకేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు తిరుపతి టీడీపీ కార్యాలయం(TDP Office)లో ఉత్తమ బూత్, యూనిట్, క్లస్టర్, మండల స్థాయి నాయకులు, ఉత్తమ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. తిరుపతి పర్యటన నిమిత్తం రేణిగుంట ఎయిర్‌పోర్ట్ చేరుకున్న మంత్రి లోకేష్‌కు మంత్రులు అనగాని సత్యప్రసాద్, రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.
మధ్యాహ్నం 2.15 నుంచి 2.45 గంటల వరకు ఎస్వీ పద్మావతి మహిళా యూనివర్సిటీ(SV Padmavati Women's University)లో నూతనంగా నిర్మించిన మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియంను మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచి 3.45 గంటల వరకు ఎస్వీ పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 4.20 గంటల నుంచి 6 గంటల వరకు ఆశా కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ దేవాలయాల సదస్సు(International Temple Conference)లో పాల్గొంటారు.






