- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు విశాఖకు ప్రధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. విశాఖలో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా నిర్వహించే ‘‘యోగాంధ్ర కార్యక్రమం’’ అత్యంత కీలకమైనది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత నెల(మే) 21వ తేదీ నుంచి యోగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రేపు జరగబోయే యోగాంధ్ర రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ మహానగరం వైపు చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్మించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ రేపు(శనివారం) విశాఖలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలో పీఎం మోడీ విశాఖ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం భువనేశ్వర్ వస్తారు. అక్కడి నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. ఆ రాత్రికి తూర్పునౌకాదళం గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. ఈ క్రమంలో రేపు(శనివారం) అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. రేపు ఉదయం 6:30 నుంచి 7:45 గంటల వరకు విశాఖపట్నం సాగరతీరంలోని ఆర్కే బీచ్‌లో జరిగే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారు. అనంతరం ఉదయం 11:50 గంటలకు విశాఖపట్నం నుంచి ఢిల్లీ బయలుదేరుతారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రధాని మోడీకి ఆహ్వానం పలికే జాబితాలో అధికారులు పహల్గాం బాధిత కుటుంబం.. కాల్పుల్లో మరణించిన చంద్రమౌళి భార్య నాగమణి పేరును కూడా చేర్చారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. విశాఖలో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా నిర్వహించే ‘‘యోగాంధ్ర కార్యక్రమం’’ అత్యంత కీలకమైనది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత నెల(మే) 21వ తేదీ నుంచి యోగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రేపు జరగబోయే యోగాంధ్ర రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ మహానగరం వైపు చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్మించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ రేపు(శనివారం) విశాఖలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలో పీఎం మోడీ విశాఖ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం భువనేశ్వర్ వస్తారు. అక్కడి నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. ఆ రాత్రికి తూర్పునౌకాదళం గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. ఈ క్రమంలో రేపు(శనివారం) అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. రేపు ఉదయం 6:30 నుంచి 7:45 గంటల వరకు విశాఖపట్నం సాగరతీరంలోని ఆర్కే బీచ్‌లో జరిగే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారు. అనంతరం ఉదయం 11:50 గంటలకు విశాఖపట్నం నుంచి ఢిల్లీ బయలుదేరుతారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రధాని మోడీకి ఆహ్వానం పలికే జాబితాలో అధికారులు పహల్గాం బాధిత కుటుంబం.. కాల్పుల్లో మరణించిన చంద్రమౌళి భార్య నాగమణి పేరును కూడా చేర్చారు.






