- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD News:తిరుమలలో సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం.. క్లారిటీ ఇదే!
కలియుగ దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలివస్తారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలివస్తారు. ఈ క్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ తరుణంలో ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి భక్తులు తిరుమల(Tirumala)కు చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ నెలకొంటుంది. అయితే, ప్రస్తుతం వేసవి సెలవులు(Summer Holidays) నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటున్నారు.
ఈ తరుణంలో భక్తుల రద్దీ దృష్ట్యా సిఫార్సు లేఖలను తిరస్కరిస్తున్నట్లు కొందరు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై టీటీడీ బోర్డు(TTD Board) సభ్యులు జ్యోతుల నెహ్రూ(Jyothula Nehru) స్పందించారు. సిఫార్సు లేఖలతో తిరుమల శ్రీవారి దర్శనం పై జ్యోతుల నెహ్రూ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో భక్తులకు అనుమతి యథాతదంగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో బోర్డు సభ్యులు, ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేఖలతో దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. మే, జూన్ నెలలకు సంబంధించి ముందుగా లేఖలు తీసుకున్న భక్తులకు దర్శనాలు యథాతదంగా ఉంటాయని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది.






