Nara Lokesh:‘ఇది కదా నేను కోరుకున్న మార్పు’.. మంత్రి లోకేష్ హర్షం

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి పై ప్రశంసల వర్షం కురిపించారు.

Nara Lokesh:‘ఇది కదా నేను కోరుకున్న మార్పు’.. మంత్రి లోకేష్ హర్షం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి పై ప్రశంసల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళితే.. రాజాంలోని డోల పేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడికి మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుడు వాసుదేవరావు స్వయంగా తానే దగ్గరుండి తన పిల్లలను ప్రభుత్వ బడికి(Govt School) పంపుతున్నందుకు మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సర్కారు బడుల పై ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన మాస్టారును ప్రశంసించారు.

ఈ క్రమంలో ‘‘ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు చూస్తుంటే ఇది కదా నేను కోరుకున్న మార్పు అనిపిస్తుంది. రాజకీయాలకు దూరంగా, సమగ్ర విద్యకు దగ్గరగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి, సమస్యలను పరిష్కరించి విద్యాలయాలుగా పాఠశాలలను తీర్చిదిద్దిన కష్టం .. రాజాం నియోజకవర్గం డోల పేటకు చెందిన టీచర్ డోల వాసుదేవరావు లాంటి వారిని చూసి మర్చిపోతాం. తన పిల్లలు ఇద్దరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారు ఈ మాస్టారు. ఒక మాస్టారే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తుంటే, మనం ఎందుకు చదివించకూడదు అని ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన వాసు మాస్టర్ కి అభినందనలు. మన బడికి మనమే అంబాసిడర్స్ గా నిలుద్దాం. అంతా కలిసి దేశానికే దిక్సూచిగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొద్దాం’’ అని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ట్వీట్

Next Story