రాష్ట్ర భవిష్యత్తును మార్చబోయే సభ ఇది.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

రాష్ట్ర చరిత్రలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అమరావతి (Amaravati) పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సందర్భంగా కాసేపట్లో ప్రధాని గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport)కు చేరుకోనున్నారు.

రాష్ట్ర భవిష్యత్తును మార్చబోయే సభ ఇది.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర చరిత్రలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అమరావతి (Amaravati) పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సందర్భంగా కాసేపట్లో ప్రధాని గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport)కు చేరుకోనున్నారు. ఈ మేరకు రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్ట్‌లకు, అదేవిధంగా కేంద్రం చేపట్టిన ప్రాజెక్ట్‌లకు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minster Narendra Modi) శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత, మంత్రి సత్యకుమార్ (Minister Satya Kumar) మాట్లాడుతూ.. రాజధాని అమరావతి (Amaravati) అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందని అన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని ఏపీలో నిర్మాణం కాబోతోందని కామెంట్ చేశారు. త్వరలోనే రాజధాని చట్టబద్ధత విషయంలో ఆలోచిస్తామని అన్నారు. రాష్ట్ర భవిషత్తును కోరకున్న వారు సభకు తప్పక హాజరు అవుతారని సత్యకుమార్ అన్నారు. .

Next Story