Nara Lokesh : ఇది జ‌గ‌న్ జంగిల్ రాజ్ కాదు : నారా లోకేష్

by Muthe.Rajitha |

టీడీపీ(TDP) కోవూరు ఎమ్మెల్యే వేమూరి ప్రశాంతి రెడ్డి(MLA Prashanthi Reddy)పై వైసీపీ(YCP) నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి(Prasanna Kumar Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) మండిపడ్డారు.

Nara Lokesh : ఇది జ‌గ‌న్ జంగిల్ రాజ్ కాదు : నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ(TDP) కోవూరు ఎమ్మెల్యే వేమూరి ప్రశాంతి రెడ్డి(MLA Prashanthi Reddy)పై వైసీపీ(YCP) నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి(Prasanna Kumar Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) మండిపడ్డారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలు మాట్లాడటానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల జోలికి వస్తే ఊరుకునేది లేదని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఈ మేరకు లోకేష్ తన X ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ' వైసీపీ నాయకులకు మ‌హిళలంటే ఇంత ద్వేష‌భావ‌మా? పెద్ద పెద్ద చ‌దువులు చ‌దివితే స‌రిపోదు.

క‌నీస ఇంగిత‌జ్ఞానం ఉండాలి. మ‌హిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించ‌ప‌రుస్తూ బ‌హిరంగంగా వ్యాఖ్యలు చేయ‌డం నేరం, దారుణం. త‌ల్లి, చెల్లిని త‌రిమేసిన అధినేత జ‌గ‌న్ రెడ్డిని ఆద‌ర్శంగా తీసుకున్నట్టున్నారు. మ‌హిళ‌ల జోలికి వ‌చ్చినా, ఆడ‌వారిపై అవాకులు చెవాకులు పేలినా ఊరుకునేందుకు ఇది జ‌గ‌న్ గారి జంగిల్ రాజ్ కాదు.. మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచే ప్రజా ప్రభుత్వం." అని వార్నింగ్ ఇచ్చారు.

Next Story