YS Sharmila:అమరావతి పునఃశంకుస్థాపనకు వస్తున్న ప్రధానికి నా బహుమతి ఇదే!?

by Jakkula.Mamatha |

ఏపీ రాజధాని అమరావతి పునః శంకుస్థాపన రేపు(శుక్రవారం) జరగనుంది.

YS Sharmila:అమరావతి పునఃశంకుస్థాపనకు వస్తున్న ప్రధానికి  నా బహుమతి ఇదే!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ రాజధాని అమరావతి పునః శంకుస్థాపన రేపు(శుక్రవారం) జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రధాని పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు అమరావతి పున:శంకుస్థాపనకు వస్తున్న పీఎం నరేంద్ర మోడీ గారికి ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తు రావాలని తెలిపారు. 10 ఏళ్లుగా చేసిన మోసంపై ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆమె కోరారు.

ఈసారైనా అమరావతి కట్టేనా ? లేక మళ్ళీ మట్టేనా ? అని ఆమె ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల క్రితం మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారు. మన ఆశల మీద నీళ్ళు చల్లి వెళ్లారని ఆమె విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి అమరావతిలో అడుగు పెట్టాలి. మరోసారి ఇలాంటి మోసం చేయనని ప్రమాణం చేయాలని వైఎస్ షర్మిల అన్నారు. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత.

ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తా అని రాసి సంతకం పెట్టాలని వైఎస్ షర్మిల(YS Sharmila) డిమాండ్ చేశారు. మాకు అప్పులు వద్దు. మా భావితరాల మీద ఆ భారం వద్దు. రాజధాని నిర్మాణం కోసం బేషరతుగా రూ.1.50 లక్షల కోట్లు 3 ఏళ్లలో కేంద్రం ఇవ్వాలని ఆమె తెలిపారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలి. అలాగే 10 ఏళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఏపీసీసీ వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story