- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ప్రపంచాన్ని విద్య ఏ రకంగా మారుస్తుంది.. సార్?’.. విద్యార్థి ప్రశ్నకు మంత్రి లోకేష్ ఆన్సర్ ఇదే!
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ(సోమవారం) వీఆర్ స్కూల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ(సోమవారం) వీఆర్ స్కూల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం తరగతి గదులను పరిశీలించిన మంత్రి లోకేష్ .. స్కూళ్లోని విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఓటమి బాధ తనలో కసి పెంచిందని మంత్రి లోకేష్ తెలిపారు. కానీ, దాని ఫలితమే 2024 ఎన్నికల్లో మెజార్టీతో గెలిచానని అని మంత్రి చెప్పారు. ఈ తరుణంలో జీవితంలో సవాళ్లను స్వీకరించాలని, అదే ప్రేరణతో విద్యాశాఖను తీసుకున్నట్లు పేర్కొన్నారు. పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ఒక్కటే ఏకైక సాధనం అని విద్యార్థులకు సూచించారు.
ప్రపంచాన్ని విద్య ఏ రకంగా మారుస్తుంది? అని ఏడో తరగతి చదివే పర్నీక్ సాయి మంత్రి లోకేష్‌ను ప్రశ్నించారు. ఇందుకు మంత్రి సమాధానం ఇస్తూ.. మంచి ప్రశ్న అడిగావు. పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ద్వారానే సాధ్యం. చదువు ద్వారానే ఉన్నత స్థానానికి వెళ్లగలం. ఎడ్యుకేషన్, ఇమ్మిగ్రేషన్ బలమైన సాధనాలు. నువ్వు కంపెనీ ప్రారంభించి పది మందికి ఉద్యోగాలు కల్పించాలని పర్నీక్ సాయిని ఉత్సాహపరిచారు. నెల్లూరులో రూ.15 కోట్లతో ఆధునీకరించిన ప్రభుత్వ స్కూల్‌ను ఆయన సందర్శించారు. పేదరిక నిర్మూలనే P4 లక్ష్యమని మంత్రి చెప్పారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకోవాలని, భవిష్యత్ లో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో విద్యార్థులకు మంత్రి లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.






