‘ఇది చాలా గర్వించదగ్గ విషయం’.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని

‘ఇది చాలా గర్వించదగ్గ విషయం’.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజా రాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పేర్కొన్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వర్క్ షాప్‌నకు హాజరైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, విద్యారంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర అధికారులకు స్వాగతం పలికారు. అమరావతి వర్క్ షాప్-2025 కు మిమ్మల్ని స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నానని మంత్రి లోకేష్ అన్నారు. ఇవాళ ఈ సమావేశం దేశంలో అత్యుత్తమ క్వాంటమ్ మేధావుల సమావేశం మాత్రమే కాదు. దేశంలో ఓ కీలక మలుపు కానుంది. భవిష్యత్తులో రాబోయే సాంకేతిక విప్లవానికి సీఎం చంద్రబాబు నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని ఇస్తోంది.

ఈ క్రమంలో అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మార్చాలనేది మా లక్ష్యం అని తెలిపారు. ఇక్కడ ఆలోచనలు ఆవిష్కరణలుగా, ఆవిష్కరణలు పరిశ్రమలుగా మారేలా ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది ఒక రోజు కార్యక్రమం కాదు. ఇది దేశ వ్యాప్తంగా ప్రారంభమైన ఉద్యమం. ఇందుకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా నిలవబోతోంది. క్యూబిట్ ఆర్కిటెక్చర్ నుంచి క్రయో ఎలక్ట్రానిక్స్ వరకు, అల్గోరిథం అభివృద్ధి నుంచి అంతర్జాతీయ క్వాంటమ్ ప్రమాణాల వరకు మేం పూర్తిస్థాయిలో క్వాంటమ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తాం. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన 156 క్యూబిట్లను కలిగిన ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్-2 త్వరలోనే అమరావతిలో అందుబాటులోకి రానుంది.

ఇది చాలా గర్వించదగ్గ విషయమని మంత్రి తెలిపారు. ఆసియాలో మొట్టమొదటి క్వాంటమ్ ప్రమాణాల టెస్ట్‌బెడ్‌ను ఎన్పీఎల్, ఐఈఈఈ, సీయాక్, ఏడబ్ల్యూఎస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐబీఎం, టీసీఎస్, హెచ్ సీఎల్, టెక్ మహీంద్ర వంటి అగ్రగామి సంస్థల సహకారంతో క్వాంటమ్ స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తాం అన్నారు. ఈ కార్యాచరణకు వ్యూహాత్మక దూరదృష్టి ఉంది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన జాతీయ క్వాంటమ్ మిషన్ కు అనుసంధానంగా, గ్లోబల్ భాగస్వామ్యాలతో నిర్మించడం జరుగుతుంది. ఐఐటీలు, ఐఐఎస్, టోక్యో యూనివర్సిటీల సహకారం తీసుకోవడం జరుగుతుందని మంత్రి లోకేష్ తెలిపారు.

Next Story