బ్రాహ్మణి ఆలోచనకు ఇది తగిన గుర్తింపు.. మంత్రి లోకేష్ ప్రశంసలు

by Jakkula.Mamatha |

ఏపీ మంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు

బ్రాహ్మణి ఆలోచనకు ఇది తగిన గుర్తింపు.. మంత్రి లోకేష్ ప్రశంసలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ 'బిజినెస్ టుడే' ఏటా అందించే 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' అవార్డుకు నారా బ్రాహ్మణి ఎంపికయ్యారు. ఈ క్రమంలో నారా బ్రాహ్మణికి అవార్డు రావడం పై మంత్రి నారా లోకేష్ స్పందించారు.

ఈ తరుణంలో హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి ప్రతిష్ఠాత్మక ‘బిజినెస్ టుడే’ అవార్డు దక్కడం పై మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ‘గర్వించదగిన భర్తగా ఉన్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ‘నాయకత్వం అంటే నిశ్శబ్దంగా సంస్థలను నిర్మించడం, దీర్ఘకాలికంగా ఆలోచించడం, పని మాట్లాడటం అనే బ్రాహ్మణి ఆలోచనకు ఇది తగిన గుర్తింపు’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

Next Story