- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇది పిరికిపందల చర్య’.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి ఘటన పై ఏపీపీసీసీ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి ఘటన పై ఏపీపీసీసీ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జమ్మూకాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో ట్రెక్కింగ్‌లో ఉన్న పర్యాటకులపై ఉగ్రమూకలు దాడి చేసిన ఘటన కాశ్మీర్ నే గాక దేశాన్నే కుదిపేసింది. ఈ ఘటన పై వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాంలో టూరిస్టుల పై జరిగిన ఉగ్రదాడి పిరికిపందల చర్య అని విమర్శించారు. ఈ దాడిలో 30 మంది చనిపోవడం, మరికొంత మంది గాయపడటం తీవ్రంగా కలిచి వేసిందని ఆమె పేర్కొన్నారు.
ఈ మేరకు మృతుల కుటుంబాలకు వైఎస్ షర్మిల ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె కోరుకున్నారు. ఈ దాడిలో మరణించిన వాళ్లలో ముగ్గురు తెలుగు వాళ్లు ఉండటం అత్యంత బాధాకరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(Government) మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలబడాలి. అలాగే ఉగ్రవాదంపై పోరుకు యావత్ దేశం కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా కేంద్ర ప్రభుత్వం(Central Govt) పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల ట్విట్టర్(Twitter) వేదికగా పేర్కొన్నారు.






