తిరువూరు పంచాయితీ : నేడు సీఎంకు నివేదిక ఇవ్వనున్న క్రమశిక్షణ కమిటీ

by Thanuru Gopichand |

ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడానికి రూ.5కోట్లు డిమాండ్ చేశారని

తిరువూరు పంచాయితీ : నేడు సీఎంకు నివేదిక ఇవ్వనున్న క్రమశిక్షణ కమిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఎంపీ కేశినేని చిన్ని తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడానికి రూ.5కోట్లు డిమాండ్ చేశారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు (Kolikapudi Srinivasa Rao) గతంలో సంచలన ఆరోపణలు చేశారు. దీంతో తిరువూరు టీడీపీలో (Tiruvuru TDP) కలకలం రేగింది. పరస్పర ఆరోపణలతో ఎమ్మెల్యే, ఎంపీలు తగువులాడుతుండడంతో వివాదాన్ని చల్లార్చేందుకు టీడీపీ అధిష్టానం స్వయంగా రంగంలోకి దిగిన విషయం విదితమే. నవంబరు 5న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావుతో పాటు ఎంపీ కేశినేని చిన్నిల నుంచి క్రమ శిక్షణ కమిటీ (Disciplinary Committee) సభ్యులు వివరణ తీసుకున్నారు. కొలికపూడి తాను చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు చూపకపోవడం పట్ల కమిటీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను మందలించడంతో పాటు తీరు మార్చుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్నిల వివరణలతో రూపొందించిన ప్రాథమిక నివేదికపై మంగళగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ (Nara Lokesh) తో చర్చించారు. వివాదంపై తుది నిర్ణయం సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటారని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ క్రమంలో తిరువూరు పంచాయితీపై సిద్ధమైన నివేదికను నేడు సీఎం చంద్రబాబు నాయుడుకు (CM Chandra Babu Naidu) క్రమశిక్షణ కమిటీ అందించనుందని సమాచారం.

Next Story