శ్రీవారి కొండపై కానిస్టేబుళ్ల హల్ చల్..ముగ్గురు సస్పెండ్

by Ajay Maddhiboyina |

మద్యం మత్తులో తిరుమల కొండపై హల్చల్ చేసిన ముగ్గురు కానిస్టేబుళ్ల‌ను సస్పెండ్ చేసినట్టు ఏపీఎస్సీ 2వ‌ బెటాలియన్ కమాండర్ దీపికా పాటిల్ తెలిపారు.

శ్రీవారి కొండపై కానిస్టేబుళ్ల హల్ చల్..ముగ్గురు సస్పెండ్
X

దిశ‌, వెబ్ డెస్క్: మద్యం మత్తులో తిరుమల కొండపై హల్చల్ చేసిన ముగ్గురు కానిస్టేబుళ్ల‌ను సస్పెండ్ చేసినట్టు ఏపీఎస్సీ 2వ‌ బెటాలియన్ కమాండర్ దీపికా పాటిల్ తెలిపారు. బెటాలియన్ ఇన్ ఛార్జీ ఆఫీసర్‌కు కూడా మెమో జారీ చేసినట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు బెటాలియన్ కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్‌లు శుక్రవారం సాయంత్రం తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు కొండపైకి వచ్చారు. ఈ క్రమంలో వారు కర్నాటకకు చెందిన భక్తుల వాహనాన్ని ఢీ కొట్టారు. కానిస్టేబుళ్లకు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేయగా ఏకంగా 300 పాయింట్లు వచ్చింది. వారిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని వెంటనే టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కర్నాటక వాహనంలో స్వల్పంగా గాయపడిన భక్తులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై టీటీడీ సైతం సీరియస్ అయ్యింది.

Next Story