మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-28 06:17:16  IST  )

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు కోనసీమ జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి సభలను ప్రారంభించారు.

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి.. ఈ మహాసభలను ప్రారంభించారు. ప్రముఖ ప్రవచన కర్తలైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు ప్రముఖ సినీ రచయిత తనికెళ్ల భరణి, ఎమ్మెల్యే ఆనందరావు ఈ మహాసభలకు హాజరయ్యారు. తెలుగు మహాసభలు జరుగుతున్న ప్రాంగణానికి దివంగత నందమూరి తారక రామారావు పేరును నామకరణం చేశారు. కిమ్స్ మెడికల్ కాలేజీలో నేడు, రేపు ఈ మహాసభలు జరగనుండగా.. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ కూడా ఈ సభలకు విచ్చేయనున్నారు. తొలిరోజు సభల్లో చాగంటి కోటేశ్వరరావు తెలుగు బాష గొప్పతనాన్ని వివరించారు.

Next Story