- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో.. ఏటీఎం చోరీ
ఇది వరకు దొంగలు ఏటీఎంలలో ఉండే నగదును ఎత్తుకెళ్లేవారు. కానీ ఇప్పుడు.. ఏటీఎంలనే ఎత్తుకెళ్లిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇది వరకు దొంగలు ఏటీఎంలలో ఉండే నగదును ఎత్తుకెళ్లేవారు. కానీ ఇప్పుడు.. ఏటీఎంలనే ఎత్తుకెళ్లిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బుధవారం తెల్లవారుజామున.. స్థానిక పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఉన్న ఏటీఎంను దుండగులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగిన కొద్దిగంటల్లోనే ఏటీఎంకు సంబంధించిన సామాగ్రిని శింగనమల మండలం ఆకులేడు శివారులో గుర్తించారు. తాడిపత్రి మెయిన్ రోడ్డుపై.. పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో ఉన్న SBI ఏటీఎం అద్దాలను పగలగొట్టి.. ఏటీఎం మెషీన్ తో పాటు.. అందులో ఉన్న బ్యాటరీలను కూడా దుండగులు అపహరించారు. ప్రతిరోజూ రద్దీగా ఉండే ప్రాంతం, పోలీస్ స్టేషన్ దగ్గర్లోనే ఈ చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ సుబ్బరాయుడు, ఎస్సై రాంప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దుండగులు పొరుగు రాష్ట్రానికి చెందినవారు అయి ఉంటారని అనుమానిస్తున్నారు.






