- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసుపత్రిలో దొంగ హల్చల్.. పేషెంట్ల సెల్‌ఫోన్లు చోరీ.. సీసీటీవీ ఫుటేజీ వైరల్
by Ramesh Naini |
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దొంగతనం కలకలం రేపింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దొంగతనం కలకలం రేపింది. అర్థరాత్రి సమయంలో పేషెంట్లు నిద్రలో ఉండగా ఓ ఆగంతకుడు వార్డులోకి చొరబడి, పేషెంట్ల మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన మొత్తం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. దొంగతనం జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాత్రివేళల్లో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీడియో ఇదే..
Next Story






