- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ గాజువాకలో రెచ్చిపోయిన దొంగలు.. 90 తులాల బంగారం చోరీ
విశాఖ గాజువాకలో దొంగలు రెచ్చిపోయారు...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ గాజువాక(Visakha Gajuwaka)లో దొంగలు(Thieves) రెచ్చిపోయారు. కూర్మపాలెంలోని కాపుజగ్గరాజుపేట వసుధ గార్డెన్స్(Vasudha Gardens)లో చోరీ చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి 90 తులాల బంగారం(Gold) ఎత్తుకెళ్తారు. తలుపులు తెరిచి ఉండటంతో ఇరుగు పొరుగు వాళ్లు విషయాన్ని యజమానికి తెలిపారు. దీంతో బాధితులు దువ్వాడ పోలీస్ స్టేషన్(Duvvada Police Station)లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీంతో ఇంట్లో చోరీ జరిగిన ప్రాంతాన్ని క్షణ్ణంగా తనిఖీలు చేశారు. స్థానిక సీసీ టీవీ ఫుటేజులను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ప్రత్యేక బృందాలతో గాలిస్తామని తెలిపారు. అయితే గతంలోనూ చోరీలు జరిగాయని, పోలీసులకు ఫిర్యాదు చేశామని అయితే కొద్ది రోజులు పెట్రోలింగ్ నిర్వహించారని, ఆ తర్వాత రావడం లేదని స్థానికులు తెలిపారు.






