- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైతాన్ సైన్యంతో నాపై తప్పుడు ప్రచారం చేశారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
అమరావతి (Amaravati) మహిళలపై సాక్షి చానెల్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు (Krishnam Raju) చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి (Amaravati) మహిళలపై సాక్షి చానెల్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు (Krishnam Raju) చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. పిశాచాలు కూడా ఇలా చేయరని.. వారిని రాక్షసులు అని కూడా అనలేం అంటూ కామెంట్ చేశారు. అందరూ కలిసి సంకర జాతిలా ఓ తెగలా మారారని.. ఆ తెగ పూనుకుంటే ఏదైనా చేయలగలదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే మహిళలపై సజ్జల చేసిన వ్యాఖ్యలకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహిళలను పట్టుకుని పిశాచులతో పోలుస్తారా అంటూ ఫైర్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగి.. జుగుప్సాకరమైన సంకర జాతి అనే పదాలను వాడటం దారుణమని అన్నారు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పేందుకు ఎందుకు నామోషీ ఎందుకని ధ్వజమెత్తారు. వైసీపీ చేసిన తప్పే మళ్లీ.. మళ్లీ చేస్తోందని కామెంట్ చేశారు. ఆనాడు సైతాన్ సైన్యంతో ఇదే వైసీపీ పార్టీ తనపై తప్పుడు ప్రచారం చేశారని.. జగన్ సొంత చెల్లికే మర్యాద లేదని వైఎస్ షర్మిల అన్నారు.






