ఆ రెండు రోజులు వారికి సెలవులు లేవు.. ఉత్తర్వులు జారీ

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-28 12:54:17  IST  )

రాష్ట్రం(Andhra Pradesh)లో ఈ నెల 30, 31వ తేదీల్లో ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు(Holidays) ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ రెండు రోజులు వారికి సెలవులు లేవు.. ఉత్తర్వులు జారీ
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో ఈ నెల 30, 31వ తేదీల్లో ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు(Holidays) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా రెండు పబ్లిక్ హాలిడేస్‌తో ఉద్యోగులకు కూడా కాస్త ఉపశమనం లభిస్తుందనే చెప్పవచ్చు. కానీ.. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ ఉద్యోగులకు సెలవులు ఉండవని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మార్చి 30, 31వ తేదీల్లో పబ్లిక్ హాలిడేల(Public Holidays) నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం(AP Government) మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ నెల 30, 31 ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ కార్యాలయాలకు పని దినాలుగా ప్రకటించింది. ఆ రెండు రోజులు(ఉగాది, రంజాన్) ఆఫీసులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేస్తాయని పేర్కొంది. ఈ మేరకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story