అటెండెన్స్ ​కోసమే వచ్చి వెళ్లారు... మంత్రి అచ్చెన్నాయుడు

by Thanuru Gopichand |

వైసీపీ సభ్యులు హాజరు కోసమే అసెంబ్లీకి వచ్చారని తేటతెల్లమైందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.

అటెండెన్స్ ​కోసమే వచ్చి వెళ్లారు... మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : వైసీపీ సభ్యులు హాజరు కోసమే అసెంబ్లీకి వచ్చారని తేటతెల్లమైందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్​లో ఆయన మాట్లాడుతూ అవినీతి, అబద్ధాల పునాదులపై వైసీపీ పుట్టిందన్నారు. గతంలో చెప్పిన వాస్తవాలే మళ్లీ చెబుతున్నారని అన్నారు. వైసీపీ సభ్యులు అటెండెన్స్​కోసమే వెళ్లారన్నారు. సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని అన్నారు. ఎన్నికల్లో ప్రజా తీర్పున శిరోధార్యం వహించాలన్నారు. సభకు వచ్చి ప్రజా సమస్యలపై వైసీపీ సభ్యులు మాట్లాడతారని భావించామని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాననడం ఎక్కడా చూడలేదన్నారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇచ్చేది కాదన్నారు. ప్రజలు ఇచ్చేదని తెలిపారు. 11 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీనియర్లు కూడా జగన్​కు వత్తాసు పలకడం దురదృష్టకరం అన్నారు. సభలో వైసీపీ నేతల వైఖరి దారుణంగా ఉందన్నారు. దేశంలో ఇటువంటి వాదనలు, ప్రతివాదనలు ఎక్కడా చూడలేదన్నారు. మిర్చి గురించి వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదం ఉందన్నారు. మార్కెట్​లో రూ.12,500 ధర ఉంటే రూ.7 వేలకు కొనాలని జీవో ఇచ్చారని అన్నారు. వింత వాదన చేస్తుంటే జగన్​ మానసిక వైఖరిపై అనుమానంగా ఉందన్నారు.

Next Story