ఫోన్​చేసి అడిగారు.. మరి జగన్​ ఇస్తారా.. లేదా..?

by Thanuru Gopichand |

కేంద్రంలో ఎన్డీయే నిర్ణయాల పట్ల మాజీ సీఎం ​జగన్ ​వైఖరి ఏంటనే ప్రశ్న

ఫోన్​చేసి అడిగారు.. మరి జగన్​ ఇస్తారా.. లేదా..?
X

ఉప రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు కోరిన బీజేపీ

వైసీపీకి 11 మంది ఎంపీల బలం

ఇటీవల రాహుల్ గాంధీ​పై జగన్ ​విమర్శలు

గతంలోనూ పలు అంశాల్లో కమలం పార్టీకే ​మద్దతు

వక్ఫ్ ​బోర్డు బిల్లుకు నో చెప్పిన వైసీపీ !

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్రంలో ఎన్డీయే నిర్ణయాల పట్ల మాజీ సీఎం ​జగన్ ​వైఖరి ఏంటనే ప్రశ్న ఏపీ రాజకీయాల్లో తరచూ తలెత్తుతుంటుంది. ఇప్పుడు మరోసారి ఆ ప్రశ్న తెరపైకి వచ్చింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్​ నాథ్ ​సింగ్ ఇవాళ వైసీపీ అధినేత జగన్ కు ఫోన్ చేశారు. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక ఏక‌గ్రీవం కోసం బీజేపీ చర్యలు చేపడుతోంది. వైసీపీకి రాజ్యసభలో ఏడుగురు, లోక్​ సభలో నలుగురు ఎంపీల బలం ఉంది. ఈ క్రమంలో వారి బలాన్ని కూడగట్టు కునేందుకు కేంద్ర మంత్రి ఫోన్​ చేసి జగన్ ​మద్దతు కోరారు. ఈ విషయాన్ని పార్టీలో చర్చించి తెలియజేస్తానని జగన్​ చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నా.. కచ్చితంగా ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ఇస్తారనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే ఏపీసీసీ చీఫ్​ షర్మిల తరచూ బీజేపీకి జగన్ ​దత్తపుత్రుడు అంటూ విమర్శిస్తుంటారు.

అడిగినా.. అడగక పోయినా..!

కేంద్రంలో ఎన్డీయే ప్రవేశ పెడుతున్న పలు బిల్లులకు, అది తీసుకుంటున్న నిర్ణయాలకు జగన్ మద్దతు తెలియజేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు.. బీజేపీ అడిగినా అడగకపోయినా.. దాదాపు అన్ని బిల్లులకు బేషరతుగానే మద్దతు తెలిపారు. కీలకమైన వ్యవసాయ బిల్లులకు, ఒకే దేశం, ఒకే ఎన్నికలు వంటి వాటికి మద్దతుగా నిలిచారు. తాను ఓడిపోయిన తర్వాత అనూహ్యంగా వక్ఫ్​ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ సమయంలో జగన్ ​బీజేపీకి దూరమై ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా అనే అనుమానాలు కూడా వచ్చాయి.

రాహుల్​ పై హాట్​ కామెంట్స్​.

లోక్‌సభలో సరిపడా సంఖ్యా బలం ఉన్నందున ఎన్డీఏ పార్టీలతో బిల్లు గట్టెక్కుతుంది. రాజ్యసభలో బిల్లు గట్టెక్కాలంటే వైసీపీ లాంటి పార్టీల మద్దతు అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలోనే రాజ్​ నాథ్ ​సింగ్.. ​జగన్​ కు ఫోన్ ​చేసి మద్దతు కోరారు. ఇప్పుడాయన నిర్ణయం ఆసక్తిగా మారింది. దేశంలో ఓట్​ చోరీ అంశంపై రెండు రోజుల కిందట కాంగ్రెస్ ​పార్టీ ముఖ్యనేత రాహుల్ ​పై జగన్​ కొన్ని విమర్శలు చేశారు. చంద్రబాబుకు రాహుల్ ​కు హాట్ ​లైన్ ​ఉందంటూ హాట్ ​కామెంట్స్​ చేశారు. ఈ క్రమంలో ఆయన ఉప రాష్ట్రపతి ఇండియా అభ్యర్థికి మద్దతు ఇవ్వబోరని, ఎన్డీయే కూటమి వైపే ఉంటారని అందరూ భావిస్తున్నారు

Next Story